‘రెబెల్' కోసం దిల్‌రాజు భారీ అమౌంట్

‘రెబెల్' కోసం దిల్‌రాజు భారీ అమౌంట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రెబెల్' చిత్రం నైజాం రైట్స్ కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ మొత్తం చెల్లించారు. ప్రభాస్‌కు సంబంధించిన వెబ్ సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన ఈ చిత్రం నైజాం హక్కులను రూ. 9.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ గత చిత్రాలతో పోలిస్తే రెబల్ చిత్రానికి ఈ రేంజ్‌లో రేటు పలకడం ఇదే తొలి సారి.

రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి రద్శకత్వం హించడంతో పాట సంగీతం, కొరియోగ్రఫీ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. జూన్ నెలలో ఆడియో విడుదల చేసి జులై మొదటి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా గతంలో కృష్ణంరాజు, బాపు కాంబినేషన్ లో వచ్చిన బుల్లెట్ చిత్రానికి కాపీ అంటూ ఓ రూమర్ ఇప్పుడు నెట్ సర్కిల్సో హల్ చల్ చేస్తోంది. అప్పట్లో ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే అదే కథని ఈ కాలానికి తగినట్లు కొద్దిగా మార్చి ప్రబాస్ చేస్తున్నాడని అంటున్నారు.

ఈ చిత్రం చాలా కాలం క్రితం ప్రారంబమై ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అయితే అసలు విడుదల లేటవటానికి కారణం ఏమిటీ అంటే..తమన్నా డేట్స్ అని చెప్తున్నారు. అనూష్కని కాదనుకుని తమన్నాని తీసుకున్నాక ఆమె డేట్స్ ఎడ్జెస్టు చెయ్యలేకపోయింది. ఆమె ఈ చిత్రం ఒప్పుకునే సరికే రచ్చ, ఎందుకంటే ప్రేమంట చిత్రాలు కమిటైంది. దాంతో ఆమె డేట్స్ కు తగినట్లు ప్రభాస్ డేట్స్ ఎడ్జెస్ట్ చెయ్యాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఈ చిత్రంకోసం ఆమె రెగ్యులర్ డేట్స్ ఇవ్వకుండా జంపింగ్ క్రింద డేట్స్ ఇచ్చింది.

తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. వేసవిలో 'రెబల్‌'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ప్రభాస్ కెరీర్‌లోనే ‘రెబల్' హై బడ్జెట్ ఫిలిం అవుతుంది.షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరిందని నిర్మాతలు చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: ‘డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.