ఇద్దరు హీరోలతో తారా చౌదరికి లింక్?

ఇద్దరు హీరోలతో తారా చౌదరికి లింక్?

సినీ అవకాశాల పేరుతో అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి నెట్టిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి తారా చౌదరికి ఇద్దరు హీరోలతో సాన్నిహిత్యం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తారా చౌదరి ఆ ఇద్దరు హీరోలతో ఇటీవలి వరకు సాన్నిహిత్యం కొనసాగించిందని అంటున్నారు. ఆవేశానికి మారుపేరైన ఒక హీరోకు ఏడేళ్ల క్రితం ఒక వేడుకలో పరిచయమైన ఆమె అప్పటి నుంచి ఆయనకు అతిథిగా మారిందట.

ఇప్పటికే ఇద్దరు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఆతిథ్యం ఇచ్చే పార్టీలకు తారా చౌదరి అదనపు హంగులను సమకూర్చేదని, విందులు వేడుకలకు తనతో పాటు మరి కొందరిని తీసుకు వెళ్లేదనే వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన ఓ రాజకీయ నేత ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో ఫోటో దిగిన అనంతరం ఆమె ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నట్లుగా తెలుస్తోంది.

కోస్తాకు చెందిన ఒక ఎంపీతో సన్నిహితం అయ్యాక కార్యక్రమాలు పెరిగాయట. అలా అలా ఆ తర్వాత తెలంగాణకు చెందిన ఓ ఎంపి ఓ ఎమ్మెల్యేతోనూ ఆమెకు సాన్నిహిత్యం పెరిగిందట. అయితే అప్పుడప్పుడు ఆమెపై కొందరు ఎదురు తిరగడంతో పోలీసు అధికారులతోనూ పరిచయం పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలా ఇద్దరు మాజీ ఐపిఎస్ అధికారులు ఆమెకు దగ్గరయ్యారట.

ఆ తర్వాత కర్నూలు, హైదరాబాద్ తదితర నగరాల్లోని పోలీసులతో ఆమెకు నెట్ వర్క్ పెరిగిందని చెబుతున్నారు. ఒకానొక సమయంలో మాజీ ముఖ్యమంత్రి భార్య పరిచయం కావడంతో సామాజిక హోదా కోసం ఆమె వెళ్లే కార్యక్రమాలకు తారా చౌదరి హాజరయ్యేది వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు దేవాలయాలకు వెళ్లినప్పుడు మాజీ ముఖ్యమంత్రి భార్య పేరును ఉపయోగించుకునేదని చెబుతున్నారు.

తారా చౌదరి కూడా తన మూడు రోజుల విచారణలో పలు విషయాలు పోలీసులకు వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. మరోవైపు ఇవేవీ నిజాలు కాదని, కావాలనే తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని తారా చౌదరి వాదిస్తోందని కూడా అంటున్నారు.