పవన్ కళ్యాణ్ బట్టలు వేలం పాట..

పవన్ కళ్యాణ్ బట్టలు వేలం పాట..

పవన్ కళ్యాణ్ వేసుకున్న బట్టలును వేలం పాట వేయనున్నారని సమాచారం. పవన్ తాజాగా నటిస్తున్న గబ్బర్ సింగ్ చిత్రంలో పోలీస్ డ్రస్ ని ఇందుకు ఎంచుకున్నారు. అయితే సినిమా విడుదలైన మొదటి వారంలో ఈ వేలం జరుగుతుందని సమాచారం. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బుని ఛారిటీకి వినియోగించనున్నారని చెప్తున్నారు. గతంలోనూ బాలకృష్ణ సింహా గొడ్డలి వంటివి వేలం వేసి ఆ వచ్చే డబ్బుని పేద కళాకారుల ఫండ్ కి విరాళంగా ఇచ్చారు. ఈ వేలం పాటలో అభిమానులు ఆనందంగా పాల్గొని మరీ ఎక్కువ రేటుకి కొనుగోలు చేస్తూంటారు.