మహేష్ , బోయపాటి కాంబినేషన్ లో ఓ చిత్రం

మహేష్ , బోయపాటి  కాంబినేషన్ లో ఓ చిత్రం

మహేష్ బాబు, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్నట్లు అంతటా రూమర్స్ వ్యాపించిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది మహేష్ బాడీ లాంగ్వేజికి బోయపాటి శ్రీను చిత్రాలకు సంభందం ఉండదు కదా...అలాంటప్పుడు వీరిద్దరి కాంబినేషన్ ఏమిటి అని కొట్టిపారేసారు. అయితే బోయపాటి శ్రీను ఇది రూమర్ కాదని త్వరలోనే తమ కాంబినేషన్ ఉంటుందని చెప్పారు. ఆయన మాట్లాడుతూ...నా తరవాతి సినిమా మహేష్‌బాబుతో అనే ఆ మాట నిజమే. అయితే ఇప్పటి వరకూ మహేష్‌బాబుకు కథ వినిపించలేదు. ప్రస్తుతం 'దమ్ము' హడావుడిలో ఉన్నా అన్నారు.

ప్రస్తుతం రూలర్ అనే పదం బాగా పాపులర్ అయ్యిన సంగతి తెలిసిందే. దమ్ము సినిమాలోని ఓ పాటలో ఈ పదం వస్తుంది. అలాగే బాలకృష్ణ అధినాయుకుడు పోస్టర్స్ పై కూడా హి రూల్స్ అని వేస్తున్నారు. ఈ నేపధ్యంలో మహేష్ తదుపరి చిత్రానికి రూలర్ టైటిల్ పెట్టే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దీనికి కారణం బూరుగు పల్లి శివరామకృష్ణ ఈ టైటిల్ ని పిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయటమే. 

బూరుగుపల్లి శివరామకృష్ణ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నారు. దాంతో ఆ చిత్రానికి రూలర్ అనే పేరు పెడతారని గుసగుసలు మొదలయ్యాయి. అందులోనూ ఆ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరక్ట్ చేయనున్నారు. బోయపాటి శ్రీను చిత్రం దమ్ములోని పాట పదమే కాబట్టి అలా ఫిక్సయ్యారన్నమాట. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను ..దమ్ము ట్రైలర్స్ విడుదల చేసి విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసి వాటిని అందుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. దమ్ము చిత్రం ఏప్రియల్ 27 న విడుదల కానుంది.

ఇక నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రస్తుతం దరువు చిత్రం చేస్తున్నారు. రవితేజ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని శౌర్యం శివ డైరక్ట్ చేస్తున్నారు. ‘దరువు'. సౌండ్ ఆఫ్ మాస్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రం మే 4న విడుదల చేయటానికి తేదీని ఖరారు చేసినట్లు నిర్మాత చెప్తున్నారు. మహేష్ బాబు వరస సినమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను చిత్రం ఉండనుందని తెలుస్తోంది.