నేడు భారత్‌కు పాకిస్థాన్ అధ్యక్షుడు

నేడు భారత్‌కు పాకిస్థాన్ అధ్యక్షుడు

పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తన కుమారుడు బిలావల్‌తో కలిసి నేడు భారత్‌కు రానున్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాను ఆయన సందర్శిస్తారు. తర్వాత ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి మధ్యాహ్న భోజన సమావేశంలో ఆయన పాల్గొంటారు. జర్దారీ పర్యటన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు అజ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాక్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ 2005లో భారత పర్యటనకు రాగా, ఆయన తర్వాత తిరిగి భారత పర్యటనకు వస్తున్న పాక్ అధినేత జర్దారీ కావడం గమనార్హం.