అతిథి పాత్రలో అమితాబ్‌?

అతిథి పాత్రలో అమితాబ్‌?

 'జింజర చిత్రంతో రామ్‌చరణ్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. 1973లో అమితాబ్‌ బచ్చన్‌ నటించిన చిత్రమిది. ఆ కథతోనే తాజా చిత్రం రూపొందుతోంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తారు. అమిత్‌ మెహ్రా నిర్మాత. ఈ రీమేక్‌లో అమితాబ్‌ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నారని బాలీవుడ్‌ సమాచారం. దర్శకుడు ఈ విషయం గురించి మాట్లాడుతూ ''అమితాబ్‌ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్‌ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు.