కృష్ణవంశీ కొత్త చిత్రం టైటిల్ 'పైసా'

కృష్ణవంశీ కొత్త చిత్రం టైటిల్ 'పైసా'

నాని,కృష్ణవంశీ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'పైసా' అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎల్లోఫ్లవర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని మంచి నిర్మాణ విలువలతో నిర్మిస్తోంది. ఈ సినిమాలో కేథరీన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది. గతంలో మిరపకాయ నిర్మించిన రమేష్‌ పుప్పాల నిర్మాత. 

ఇక గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృష్ణవంశీ శైలిలో కథ, కథనాలుంటాయని తెలిసింది. వరసగా కృష్ణ వంశీ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతున్నాయి. మహాత్మ, మొగుడు చిత్రాలు మార్కెట్లో మంచి హైప్ తెచ్చుకున్నా వర్కవుట్ కాలేదు. ముతక కథ,కథనం ఈ చిత్రాలుకు మైనస్ గా మారాయి.

నాని 'ఈగ' తరవాత చేస్తున్న చిత్రమిదే. ఓ ప్రక్క గౌతమ్ మీనన్ దర్సకత్వంలో ఎటో వెళ్లి పోయింది మనస్సు చిత్రంలో చేస్తూ నాని ఈ చిత్రం కమిటయ్యారు. మొదట ఈ చిత్రానికి పైసాలో పరమాత్మ టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత జెండాపై కపిరాజు అని వార్తలు వచ్చాయ. అయితే పైసాలో పరమాత్మ టైటిల్ వేరే వారు తమ సినిమాకు పెట్టుకుని ఉండటంతో పైసా టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. 

అలా మొదలైంది చిత్రం దర్సకురాలు నందినీ రెడ్డి గతంలో కృష్ణవంశీ అసెస్టెంట్. ఆ చనువుతో నానిని ఈ ప్రాజెక్టుకు ఒప్పించినట్లు చెప్పుకుంటున్నారు. కృష్ణవంశీ సైతం ఎలాగైనా ఈ ప్రాజెక్టుతో హిట్ కొట్టాలని కసిగా చేస్తున్నట్లు చెప్తున్నారు. ఫన్ తో కలసిన సోషల్ రెలివెంట్ సబ్జెక్టు అని టాక్ వినపడుతోంది.