పదిమంది ఉన్నా నేను నేనే

నేను యాక్ట్ చేసే సినిమాలో ఎంతమంది హీరోయిన్లున్నా నాకు ప్రాబ్లమ్ లేదు. నా మీద నాకు నమ్మకం లేకపోతే భయపడాలి. ఫ్రేమ్‌లో పదిమంది హీరోయిన్లున్నా నా నటనతో సెంటరాఫ్ ఎట్రాక్షన్' అవ్వగలుగుతాను'' అంటున్నారు అసిన్. ఈ కేరళ భామ నటించిన హిందీ చిత్రం హౌస్‌ఫుల్ 2' ఇటీవల విడుదలైంది. ఇందులో అసిన్ కాకుండా జాక్వెలైన్ ఫెర్నాండెజ్, జరీన్‌ఖాన్, షాజన్‌పదమ్‌సీ కూడా నటించారు.
ఇంతమంది కథానాయికల కాంబినేషన్లో నటిస్తే ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే అవకాశం లేదు కదా? అనే ప్రశ్నకు అసిన్ పై విధంగా స్పందించారు. ఈ మలయాళ సుందరి మరింత విపులంగా చెబుతూ -బేసిక్‌గా నేను ఫ్రెండ్లీ టైప్. హౌస్‌ఫుల్ 2' సెట్లో జాక్వెలైన్, జరీన్, షాజన్తో నాకు మంచి స్నేహం ఏర్పడింది. మా కాంబినేషన్లో సీన్స్ తీసినప్పుడు లొకేషన్ చాలా సందడిగా ఉండేది. ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు కాబట్టి.. నేను అభద్రతాభావానికి గురయ్యానని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. పనిగట్టుకుని ప్రచారం చేయడానికి కొంతమంది వెయిట్ చేస్తారనుకుంటా.
అలాంటివాళ్లు సృష్టించిన ఈ వార్తను నమ్మొద్దు'' అన్నారు. బాలీవుడ్లో ప్రముఖ కథానాయికలు సైతం ప్రత్యేక పాటలు చేస్తున్నారు కదా. మరి మీక్కూడా ఐటమ్ పాటలు చేసే ఉద్దేశం ఉందా? అని అసిన్‌ని అడిగితే - నేను భరతనాట్యం నేర్చుకున్నాను. నాకు డాన్స్ చేయడం చాలా ఇష్టం. కానీ ఐటమ్ పాటలకు డాన్స్ చేయడం ఇష్టంలేదు. ఒక ఐటమ్ పాట చేస్తే చాలు ఐటమ్ గాళ్' అంటారు. ఆ మాట అనిపించుకోడం ఇష్టంలేదు. ఎంత పారితోషికం ఇచ్చినా ఐటమ్ పాటలు చెయ్యను'' అని చెప్పారు.