'అయోమయం అపార్ట్‌మెంట్‌' (టింగరోళ్ళ అడ్డా)

'అయోమయం అపార్ట్‌మెంట్‌' (టింగరోళ్ళ అడ్డా)

 నగరజీవితంలో అపార్ట్‌మెంట్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఒకే చోట వందలాది కుటుంబాలు జీవిస్తుంటాయి. ఒక్కొక్కరిది ఒకోరకమైన మనస్థత్వం, నేపథ్యం. అలా కొన్ని కుటుంబాలు కలిసి ఉంటే జరిగే కథతో శ్రీపవన్‌సాయి ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ 'అయోమయం అపార్ట్‌మెంట్‌' పేరుతో చిత్రాన్ని నిర్మిస్తోంది. టింగరోళ్ళ అడ్డా అంటూ దీనికి ఉపశీర్షిక పెట్టారు. దర్శకత్వ శాఖలో మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న బి.సీతారామయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ప్రదానంగా రూపొందే ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం నవ్వులు కురిపిస్తుందని చిత్ర నిర్మాత బి.పవన్‌సామ్రాట్‌ తెలిపారు. ఈనెల ఆరవ తేదీన హైదరాబాద్‌లో షూటింగ్‌ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ చిత్రంలో సత్యసాగర్‌, శిరీష, తామాక్షి, కొండవలస, బాబూమోహన్‌, ఉషారాణి, జెన్నీ, రాగిణి, చలపతిరాజు, బండజ్యోతి, డిఎస్‌పి., మల్లికార్జునరావు, లక్కింశెట్టి నాగేశ్వరరావు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వరికుప్పల యాదగిరి, ఛాయాగ్రహణం: సుధాకర్‌ నాయుడు, కో డైరెక్టర్‌: శ్రీనివాసరెడ్డి, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.సీతారామయ్య.