ఒకేసారి ఉప ఎన్నికలు: భన్వర్ లాల్

ఒకేసారి ఉప ఎన్నికలు: భన్వర్ లాల్

రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు పార్లమెంట్ స్థానానికి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. ఉప ఎన్నికలు మే నెలలో ఉండకపోవచ్చని, ఆగస్ట్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నిక నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామన్నారు. ఎన్నికల్లో బెట్టింగ్ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని భన్వర్ లాల్ తెలిపారు. ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.