చిత్తూరు పర్యటనకు చంద్రబాబు

చిత్తూరు పర్యటనకు చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం చిత్తూరు పర్యటనకు వెళ్తున్నారు. పట్టణ సరిహద్దులోని మరుకంబట్టు వద్ద ఆయనకు స్థానిక తెలుగుదేశం నేతలు స్వాగతం పలకనున్నారు. అక్కడ నుంచి కొంగారెడ్డిపల్లెలో జిల్లా పార్టీ కార్యాలయం వరకు జరిగే మోటార్ సైకిళ్ల ర్యాలీలో చంద్రబాబు పాల్గొంటారు. 

అటు తర్వాత జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో మాజీ తెలుగుదేశం నేత జంగాలపల్లి శ్రీనివాసులు, ఆయన అనుచరులు తిరిగి పార్టీలో చేరనున్నారు. తర్వాత తిరుపతిలో ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అధినేత పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.