మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ దే గెలుపు

మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ దే గెలుపు

 రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, రాబోయే ఉప ఎన్నికలను రెఫరెండంగా భావించడం లేదని రాజ్యసభ సభ్యులు చిరంజీవి పేర్కొన్నారు.తిరుపతిలో పలుచోట్ల ప్రజాపథం కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌ పాల్గొనడానికి వస్తున్న నేపధ్యంలో రేణిగుంట విమానాశ్రయంలో సిఎంకు స్వాగతం పలికేందుకు వచ్చిన చిరంజీవి మీడియాతో మాట్లాడారు. 

పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చిరంజీవి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సఖ్యత లోపించిందని, పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఇది వరకు తాను ప్రాతినిధ్యం వహించిన తిరుపతి స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకునేందుకు కృషి చేస్తానని ,తిరుపతిలో మంచినీటి సమస్యను ఐదు నెలల్లో పరిష్కరిస్తామని చిరంజీవి పేర్కొన్నారు.