ఢిల్లీ బయల్దేరిన సీఎం, బొత్స

ఢిల్లీ బయల్దేరిన సీఎం,  బొత్స

ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం ఉదయం ఢిల్లీ బయల్దేరారు. కాగా సీఎం బొత్సల వివాదంపై నేడు హస్తినలో పంచాయతీ జరగనుంది.

వివాదాలతో విసిగిపోయిన హైకమాండ్‌ మార్పులపై మల్లగుల్లాలు పడుతోంది. అందుకే మధ్యేమార్గ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ చీఫ్‌-సీఎంలలో ఒకరిపై వేటు ఖాయమనిపిస్తోంది. ఆ ఒక్కరు ముఖ్యమంత్రి అనే వాదన ఢిల్లీలో బలంగా వినిపిస్తోంది. తెలంగాణ నేతకు సీఎం పదవి తప్పదనిపిస్తోంది.