అభ్యర్థి ఖరారులో ఆచితూచి అడుగులు

అభ్యర్థి ఖరారులో ఆచితూచి అడుగులు

పరకాల ఉప ఎన్నిక TRSకు సవాల్‌గా మారుతోంది. 2009 నుండి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తూ వచ్చిన ఆ పార్టీకి పాలమూరులో షాక్‌ తగిలింది. అక్కడ బిజెపి చేతులో ఎదురైన పరాభవానికి పరకాలలో ప్రతీకారం తీర్చుకోవాలని గులాబీ దండు భావిస్తోంది. అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్న TRS... నియోజకవర్గంలో పల్లెబాటకు సిద్దమౌతోంది. 

తెలంగాణావాదుల మధ్య పోరుకు పరకాల వేదికగా మారనుంది. తెలంగాణావాదుల ఐక్యతకోసం పనిచేస్తున్నామని చెప్పుకునే టి జెఎసి...మరోసారి భాగస్వామ్య పార్టీలైన బిజెపి, టిఆర్‌ఎస్‌ల మధ్య సయోధ్య కుదర్చడంలో విఫలమైంది.దీంతో మరోసారి ఈ రెండు పార్టీలు పరకాల వేదికగా కత్తులు దూసుకునేందుకు సిద్దమౌతున్నాయి. 

టి జెఎసి సహకారం వల్లే పాలమూరులో బిజెపి గెలిచిందనే భావనలో ఉన్న టిఆర్‌ఎస్‌...పరకాలలో గెలవడం ద్వారా బిజెపిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. పరకాలలోనూ టి జెఎసి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించే అవకాశాలు లేకపోయినా...సిపిఐ సహకారం కలిసివస్తుందనే అంఛనాలో టిఆర్‌ఎస్‌ ఉంది. 

అభ్యర్థిని ప్రకటించే విషయంలో టిఆర్‌ఎస్‌...ఆచితూచి అడుగులేస్తోంది. పార్టీలో అసంతృప్తి చెలరేగితే మరింత గందరగోళం తప్పదనే భావనతో అభ్యర్థి ఎంపికను కొద్దిరోజులు వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ లోపుగా ఉప ఎన్నిక ఇంఛార్జీ హరీష్‌రావు నేతృత్వంలో టికెట్‌ ఆశిస్తున్న అందరు అభ్యర్థుల భాగస్వామ్యంతో పరకాలలో పల్లెబాట చేపట్టాలని యోచిస్తోంది. 

పాలమూరు పరాభవానికి పరకాల విజయంతో సమాధానం చెప్పాలనుకుంటున్న టిఆర్‌ఎస్‌ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి.ఈ నెల 16న జరిగిన టిఆర్‌ఎస్‌ పోలిట్‌బ్యూరో సమావేశం విజువల్స్‌ తో పాటు...స్టేషన్‌ ఘనపూర్‌లో హరీష్‌ ప్రచారం విజువల్స్‌ వాడుకోగలరు.