ఇక్కడే స్థిరపడుతుందా?

ఇక్కడే స్థిరపడుతుందా?

 'కోచ్చడయాన్'తో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశం కొట్టేసింది దీపికా పడుకునే. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. 'కోచ్చడయాన్' తర్వాత దీపికా శంకర్ చిత్రంలో నటించే అవకాశాలున్నాయని కోలీవుడ్ సమాచారం. శంకర్ 'నన్బన్' పూర్తయ్యాక ఓ కథను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో సూర్యగానీ, విక్రమ్ గానీ నటిస్తారని సమాచారం. ఆ చిత్రం కోసమే ఇటీవల శంకర్ దీపికాకు కథ చెప్పారట. దీపికకు కూడా కథ నచ్చిందట. ఇంతకీ అమ్మణి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేదా? అనే విషయం తెలియట్లేదు. ఈ సినిమా వర్కవుట్ అయితే మాత్రం దీపికకు దక్షిణాదిన అవకాశాలకు కొదవుండవన్నది విశ్లేషకుల అభిప్రాయం.