ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాదు

ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాదు

వచ్చే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి అన్నారు. రాయలసీమలో కాంగ్రెస్కు మూడో స్థానమేనని ఆయన పేర్కొన్నారు. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని తిరుగుతున్నానని, అధిష్టాన ఆదేశానుసారం రాజీనామా లేఖ సమర్పిస్తానని డీఎల్ అన్నారు.

2014 వరకూ కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తమిళనాడు పరిస్థితే నెలకొంటుందని డీఎల్ వ్యాఖ్యానించారు. జగన్ను అరెస్ట్ చేసే అవకాశం లేదన్నారు. జగన్కు ఒకసారి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయన్నారు. జగన్కు సరైన సలహాదారు లేకపోవటమే రాజకీయంగా ఆయనకు లోటు అని డీఎల్ అన్నారు.