కోర్టు ధిక్కారణ కేసులో గిలానీ దోషి

కోర్టు ధిక్కారణ కేసులో గిలానీ దోషి

పాకిస్తాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీపై దాఖలైన కోర్టు ధిక్కార కేసుపై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ధిక్కారణ కేసులో గిలానీని న్యాయస్థానం దోషిగా తేల్చింది. పాక్ అధ్యక్షుడు జర్థారీపై లంచం కేసులను తిరగదోడాలన్న సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గిలానీపై ధిక్కార కేసు నమోదవడం తెలిసిందే. 

ఈకేసులో 30 క్షణాల్లోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. గిలానీ అర నిమిషం పాటు కోర్టులో ఉండేలా నామమాత్రపు శిక్షను విధించారు. మూడు నెలల విచారణ తర్వాత గిలానీకి పాక్ సుప్రీంకోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. కోర్టు తీర్పుపై గిలానీ, ఆయన మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. పాక్ రాజ్యాంగం ప్రకారం ఆయన ప్రధాని పదవిని కోల్పోయే అవకాశం ఉంది.