ప్రచారాన్ని ప్రారంభించిన గుర్నాథరెడ్డి

ప్రచారాన్ని ప్రారంభించిన గుర్నాథరెడ్డి

మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఉపఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పట్టణంలోని అరవింద్ నగర్లో మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి జెండా ఊపి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గుర్నాథరెడ్డి మహానేత వైఎస్ఆర్, అంబేద్కర్, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

అనంతరం ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తూ మహానేత వైఎస్ అమలు చేసిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. వాటిని ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించిన తీరును, అధికార పార్టీతో లోపాయికారీ పొత్తు పెట్టుకున్న టీడీపీ వైఖరిని తెలియజేస్తామని వెల్లడించారు. ఇడుపులపాయ ప్లీనరీలో జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పథకాలను వివరించి, పార్టీకి ఓటేయాలని కోరతామని గుర్నాథరెడ్డి తెలిపారు.