కోదండరామ్‌పై గుర్రుమంటున్న కెసిఆర్

కోదండరామ్‌పై గుర్రుమంటున్న కెసిఆర్

 తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గుర్రుమంటున్నారు. మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి తెలంగాణ జెఎసియే కారణమని కెసిఆర్ భావిస్తున్నారు. తెరాస పాటు జెఎసిలోని బిజెపి కూడా మహబూబ్‌నగర్‌లో పోటీ చేసింది. దాంతో తెరాస ఓడిపోయి బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డి గెలిచారు. దాంతో తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులపై కూడా తెరాస నాయకులు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. 

మహబూబ్‌నగర్ విషయంలో కోదండరామ్ మౌనంగా ఉన్నప్పటికీ స్థానిక జెఎసి నాయకులు బిజెపికి మద్దతిచ్చారు. ఇప్పుడు వరంగల్ జిల్లాలోని పరకాలలో కూడా అదే పరిస్థితి రానుంది. దీంతో తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఇరకాటంలో పడ్డారు. నిజానికి, మహబూబ్‌నగర్‌ సీటును తెలంగాణ జెఎసి ప్రతినిధికి ఆశించారు. కెసిఆర్ వారికి ఇవ్వకపోవడంతో కినుక వహించి బిజెపికి మద్దతు పలికినట్లు చెబుతున్నారు. 

మహబూబ్‌నగర్‌లో సాధించిన విజయంతో పరకాలలో పోటీ చేసేందుకు బిజెపి రంగం సిద్ధం చేసుకుంది. ఇక్కడ కూడా మహబూబ్‌నగర్ పరిస్థితినే తెరాస ఎదుర్కోబోతున్నది. దీంతో తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఇరకాటంలో పడే పరిస్థితి వచ్చింది. బిజెపి జెఎసి నుంచి తప్పుకోకుండానే కెసిఆర్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధపడింది. తమను జెఎసి నుంచి తప్పించలేని స్థితిని బిజెపి కోదండరామ్‌కు కల్పించింది. బిజెపిని కాదని తెరాసకు జెఎసి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే కెసిఆర్‌కు కోదండరామ్ తొత్తుగా మారారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కోదండరామ్ స్థితి ఇబ్బందికరంగా మారింది.

బిజెపిని విమర్శించడానికి కెసిఆర్‌కు కూడా కారణమేదీ దొరికడం లేదు. పరకాలలో బిజెపి పోటీ చేస్తే కెసిఆర్ మరింత