తిరుమలలో పోటెత్తిన భక్తజనం

తిరుమలలో పోటెత్తిన భక్తజనం

తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవులు, వరుస సెలవులు రావడంతో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 20 గంటలకుపైగా సమయం పడుతోంది. గంటల తరబడి నిరీక్షించినా గదులు అందుబాటులో ఉండకపోవడంతో కాంప్లెక్స్‌ల వద్ద లాకర్లను పొంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. 

కళ్యాణ కట్ట వద్ద శ్రీవారికి తలనీలాలు సమర్పించడానికి సుమారు 8 గంటలపాటు వేచి ఉండవలసివస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్లో వేచి వున్న భక్తులకు సకాలంలో అన్న ప్రసాదాలు, మంచినీరు, పాలు, మజ్జిక అందిస్తున్నారు. తిరుమల పరిసరాలన్నీ గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి.