షాహిద్‌తో ఇలియానా?

షాహిద్‌తో ఇలియానా?

గోవా భామ ఇలియానాకు వరుస అవకాశాలు వెల్లు జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ వయ్యారి క్రేజీ ప్రాజెక్ట్‌లను సొంతం చేసుకుంటోంది. ఇలియానా ప్రస్తుతం తెలుగులో 'దేవుడు చేసిన మనుషులు' 'జులాయి' చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సుందరి షాహిద్ కపూర్ సరసన ఓ హిందీ చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే...లింగుస్వామి దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'వేట్టై'. ఆర్య, మాధవన్, అమలాపాల్, సమీరాడ్డి ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి హిందీలోకి రీమేక్ చేసే సన్నాహాల్లో వున్నారు. తమిళంలో ఆర్య చేసిన పాత్రను షాహిద్‌కపూర్ పోషించనున్నాడు. ఆర్యకు జోడీగా నటించిన అమలాపాల్ పాత్ర కోసం ఇలియానాను ఎంపికచేసే ఆలోచనలో దర్శకుడు లింగుస్వామి వున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆయన ఇలియానాను సంప్రదించాడని, ఈ సినిమాలో నటించడానికి ఆమె సుముఖంగా వున్నట్లు సమాతెలిసింది. యు.టి.వి మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.రణభీర్ కపూర్ కథానాయకుడిగా ఇలియానా నటించిన తొలి బాలీవుడ్ చిత్రం 'బర్ఫీ' విడుదల కావల్సివుంది.