ఖమ్మం అబ్బాయి- ఫిలిప్పైన్స్‌ అమ్మాయి

ఖమ్మం అబ్బాయి- ఫిలిప్పైన్స్‌ అమ్మాయి

ఖమ్మం అబ్బాయి- ఫిలిప్పైన్స్‌ అమ్మాయి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. భాషలు, సంప్రదాయాలు వేరైనా పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. ఖమ్మం జిల్లా ఖానాపురానికి చెందిన పవన్‌ ఉద్యోగం కోసం పిలిప్పైన్స్‌ వెళ్లాడు. అక్కడే 2007లో జీన్‌ ఏసియో పరిచయమైంది. 

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత పవన్‌ వేరే దేశాలకు వెళ్లినా... ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. దీంతో పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఖమ్మంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ముందు ఫిలిప్పైన్‌ సంప్రదాయం ప్రకారం, ఆ తర్వాత హిందూ పద్దతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.