త్వరలో ఓ మంచి న్యూస్ చెబుతా

కాంచనమాల కేబుల్ టీవీ'లో తొలిసారి కనిపించి... కాంచన'తో హిట్ కొట్టేసి క్రేజీ హీరోయిన్ల లిస్ట్‌లో చేరారు లక్ష్మీరాయ్. బాలకృష్ణతో ఈ ముద్దుగుమ్మ నటించిన అధినాయకుడు' త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే... ఇక లక్ష్మీరాయ్ హవా మొదలైనట్టే. అయితే... ప్రస్తుతం ఈ అందాలభామ దృష్టి మాత్రం బాలీవుడ్‌పైనే ఉంది. గతంలో ఓ స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్' అంటూ దేశవ్యాప్తంగా లక్ష్మీరాయ్‌పై ఓ గాసిప్ హల్చల్ చేసిన విషయం తెలిసిందే.
ఈ గాసిప్ పుణ్యమా అని ఇప్పటికే అక్కడ మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు లక్ష్మీరాయ్. అలా అనాయోచితంగా వచ్చిన పాపులారిటీని అసరాగా తీసుకొని ప్రస్తుతం అక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు లక్ష్మీరాయ్. ఈ విషయాన్ని ఆమె ముందు ప్రస్తావిస్తే -నాకున్న అందానికి ఎప్పుడో బాలీవుడ్‌కి వెళ్లాలి. కాలం కలిసిరాక ఇలా ఉండిపోవాల్సివచ్చింది.
అయితే మునుపటితో పోలిస్తే ఇప్పుడు మంచి అవకాశాలొస్తున్నాయ్. అధినాయకుడు'లో నా పాత్ర చాలా బాగుంటుంది. బాలకృష్ణ లాంటి గొప్ప స్టార్‌తో పనిచేయడం మరచిపోలేని అనుభూతి. అయితే... ఇంతటితో సంతృప్తి చెందాలని నేను అనుకోవడంలేదు. బాలీవుడ్‌కి వెళ్లి అక్కడున్న స్టార్లందరి సరసనా నటించి గ్రేట్ హీరోయిన్ అనిపించుకోవాలనుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే కొందరు బాలీవుడ్ దర్శకుల్ని కలిశాను. త్వరలోనే ఓ మంచి కబురు చెబుతాను'' అని చెప్పారు.