రాసలీల కేసుపై స్పందించిన నిత్యానంద

రాసలీల కేసుపై స్పందించిన నిత్యానంద

రాసలీల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసారు. తనపై కర్ణాటక సీఐడీ ఇచ్చిన రిపోర్టు తప్పుల తడక అని ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తానని బెంగళూరులో ఆయన ప్రకటించారు. తానే సీబీఐ విచారణ కోరతానని నిత్యానంద చెప్పారు. 

తమపై ఆరోపణలు చేసిన డ్రైవర్ లెనిన్ కూడా క్రిమినలేనని .. అతను చెప్పిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని.. తనపై తీసిన వీడియో నకిలీదని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని త్వరలోనే ధృవీకరిస్తామని చెప్పారు.