జూ.ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌లో ?

జూ.ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌లో ?

సిక్స్‌ప్యాక్‌ అంటేనే ఓ స్పెషల్ క్రేజీ వస్తుంది. అదీ స్టార్ హీరో అయితే మరింతా పాపులర్ అవుతుంది. తాజాగా సిక్స్‌ప్యాక్‌ లిస్ట్ లోకి యంగ్ టైగర్ చేరబోతున్నాడు. ఫర్ ఫెక్ట్ ఫిజక్ కోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టాడట యంగ్ టైగర్. ఎంతో శ్రమ తీసుకుంటున్న ఎన్టీయార్...సిక్స్ ప్యాక్ మోజును కూడా తీర్చుకోబోతున్నాడంట

బన్నీ, నితిన్, సునీల్... వంటి హీరోలకు ఆరు పలకల బాడీ వచ్చేలా ట్రైనింగ్ ఇచ్చిన  ట్రైనర్ ఖలీల్ పర్యవేక్షణలో సిక్స్‌ప్యాక్‌కు రెడీ అయ్యాడంట ఎన్టీఆర్. ఇందుకోసం ఏకంగా కోటి రూపాయలతో జిమ్ పరికరాలు కూడా కోనుగోలు చేశాడట ఈ యంగ్ హీరో.

ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్ళలో తాత ఎన్టీఆర్ లా బొద్దుగా ఉండేవాడు. ఆది, సింహాద్రీలో బొద్దుగానే ఉన్నాడు...ఆ తర్వాత మరింత బరువు పెరిగాడు. బాగా ఒళ్లు చేసినప్పటికీ  యాక్టింగ్..యాక్షన్...డ్యాన్సుల్లో ఏమాత్రం తేడా చూపించలేదు. మరీ లావెక్కిపోతున్నానని గమనించిన ఎన్టీఆర్ ట్రెండ్ కు తగ్గట్లు స్లిమ్ అవ్వాలని నిర్ణయించుకుని కఠోర శ్రమ చేశాడు. ఆహార నియమాలు మార్చుకున్నాడు.  లాప్రొస్కోపిక్ సర్జరీ చేయించుకున్నాడు.  ఆ తర్వాత కూడా ఫర్ ఫెక్ట్ డైయిట్ మెయిన్ టెన్ చేశాడు. యమదొంగలో పూర్తిగా మారిపోయాడు . స్ర్కీన్ పై ఎన్టీఆర్ ను చూసిన వారంతా నమ్మలేకపోయారు.

స్లిమ్ గా ఉండడంలోని అనందాన్ని ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ కంత్రి మూవీకి వచ్చేసరికి మరీ సన్నబడ్డాడు.  ఎవ్వరూ ఊహించలేనంతగా  బాడీలోని కొవ్వునంతా కరిగించేశాడు.  బాగా స్లిమ్ గా ఉన్నావు కానీ... ముఖంలో, బాడీలో  గత చార్మింగ్ తగ్గిందనే అనే కామెంట్స్ ఎన్టీయార్ కే వినిపించాయి. మరి స్లిమ్ గా ఉంటే అసలే మోసం వస్తుందని కొంచెం కండ పట్టాడు ఎన్టీయార్..బృందావనంలో ప్రెష్ లుక్ తో కనిపించాడు. ఆ తర్వాత ఊసరవెల్లిలో మరింత కండ పెంచి గుడ్ లుక్స్ మెయిన్ టైన్ చేశాడు. ఇలా తన బాడీపై గత ఐదేళ్లలో అనేక రకాల ప్రయోగాలు చేసి ప్రస్తుతం ఫర్ ఫెక్ట్ ఫిజిక్ తో ఉన్న ఎన్టీయార్... మరింత శారీర దారుఢ్యాన్ని పెంచుకోవాలనకుంటున్నాడు. సినీ సెలబ్రిటీల మోజుగా మారిన సిక్స్ ప్యాక్ లోకి మారబోతున్నాడు.