50 రోజుల 'పూలరంగడు'

50 రోజుల 'పూలరంగడు'

 సునీల్ హీరోగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై వీరభద్రమ్ దర్శకత్వంలో నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మించిన 'పూలరంగడు' చిత్రం శనివారంతో 50 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'మా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన 'బిజినెస్‌మేన్' చిత్రం సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించింది. అలాగే ఆ సంస్థ సమర్పణలో రూపుదిద్దుకున్న 'పూలరంగడు' సినిమా మహాశివరాత్రి సందర్భంగా విడుదలై విజయవంతమైంది. శనివారంతో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్ర విజయానికి సునీల్ సిక్స్‌ప్యాక్, అనూప్ సంగీతం బాగా ప్లస్ అయ్యాయి. 'ప్రేమ కావాలి' తరువాత మా బేనరులో రూపుదిద్దుకున్న 'పూలరంగడు' కూడా విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్ర విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ, ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు' అన్నారు.