తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

 కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 25 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచివున్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 20 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు వేచి చూడాల్సివస్తోంది. భక్తుల రద్దీ దృష్ట్యా మహా లఘుదర్శనం అమలు చేస్తున్నారు. 34,961 మంది భక్తులు నిన్న స్వామివారిని దర్శించుకున్నారు.