సమంతకు గౌతమ్ మీనన్ ఝలక్

సమంతకు గౌతమ్ మీనన్ ఝలక్

నిన్నటి వరకు సమంత తన డార్లింగ్ అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడామె కలలో కూడా ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. నిజానికి ఈ అమ్మడికి లైఫ్ ఇచ్చింది గౌతమ్ మీననే. విన్నైతాండివరువాయా, నడునిసి నాయ్‌గళ్ చిత్రాల్లో అతిథి పాత్రల్లో అవకాశం ఇచ్చినా, తెలుగులో ఏ మాయ చేసావే చిత్రం ద్వారా హీరోయిన్‌గా బ్రేక్ ఇచ్చింది గౌతమ్ మీనన్‌నే. ఈయన ప్రస్తుతం రూపొందిస్తున్న త్రిభాషా చిత్రం నీదానే ఎన్ పొన్ వసంతంలో సమంతనే హీరోయిన్. 

గౌతమ్ మీనన్ విజయ్‌తో తెరకెక్కించనున్న మోహన అధ్యాయం ఒండ్రు చిత్రంలోను సమంతనే హీరోయిన్ అని మాట ఇచ్చారట. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని కోలీవుడ్ చెవులు కొరుక్కుంది. ఈ పరిస్థితుల్లో మోహన అధ్యాయం ఒండ్రు చిత్రంలో హీరోయిన్ సమంత కాదంటూ ఆమెకు ఝలక్ ఇచ్చారు గౌతమ్ మీనన్. తన చిత్రాల్లో వరుసగా ఒకే హీరోయిన్ నటించడం ఇష్టం లేదట. అందుకే విజయ్ చిత్రం నుంచి సమంతను తొలగించినట్లు సమాచారం.