రాష్ట్ర సర్కార్ పై సుప్రీం సీరియస్‌

రాష్ట్ర సర్కార్ పై సుప్రీం సీరియస్‌

తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో హైకోర్టులో జరిగిన సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ న్యాయవాదుల నుంచి న్యాయమూర్తులకు రక్షణ కల్పించలేకపోవడంపై సుప్రీం కోర్టు మండిపడింది. ప్రభుత్వం ప్రేక్షక పాత్రవహించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై రెండు వారాలలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం, రిజిస్ట్రార్, డిజిపిలను సుప్రీం కోర్టు కోరింది.

సుప్రీం కోర్టు సంధించిన ప్రశ్నలు:

హైకోర్టు ఆవరణలో దీక్ష చేయడానికి న్యాయవాదులకు ఎవరు అనుమతి ఇచ్చారు?
ఆందోళన చేస్తున్న న్యాయవాదులను కోర్టు ప్రాంగణం నుంచి బయటకు ఎందుకు పంపలేదు?
కోర్టు గదిలోకి వెళ్లి న్యాయవాదులు గొడవ చేస్తుంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు?
కోర్టు హాలులో న్యాయమూర్తులనే బెదిరించే పరిస్థితి ఉందంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?
న్యాయమూర్తులను చంపినా చూస్తూ ఊరుకుంటారా?
న్యాయమూర్తులు, న్యాయవాదుల భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు?
హైకోర్టులో జరిగిన ఘటనలకు సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు?