119 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

119 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

స్టాక్‌మార్కెట్‌లో వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలు నమోదయ్యాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఆశాభావం, ఆసియా మార్కెట్లు బలంగా ఉండడంతో మార్కెట్ సానుకూలంగా ముందుకు సాగింది. గత రెండు సెషన్స్‌లో 420 పాయింట్లు కూడగట్టుకున్న సెన్సెన్స్ నేడు మరో 119 పాయింట్ల వృద్ధితో 17,597 వద్ద స్థిరపడింది. ఇంట్రా డే ట్రేడింగ్‌లో 17,664 పాయింట్ల గరిష్టస్థాయిని సెన్సెక్స్ తాకింది. ఎన్‌ఎస్‌ఈ సూచి నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 5,358 వద్ద ఆగింది. ఫెడరల్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటాలు బాగా లాభపడ్డాయి.