యుఎస్‌లో అమ్మకానికి పట్టణం

యుఎస్‌లో అమ్మకానికి పట్టణం

అమెరికాలో 50 లక్షలుంటే ఊరు మీదే అమ్మకానికి సిద్దమైన బ్యూఫోర్డ్‌ మీరు విల్లా కొనాలనుకుంటున్నారా? 50 లక్షల వరకు వెచ్చించగలరా? అయితే.. ఏకంగా ఓ ఊరినే కొనేయొచ్చు. అది కూడా అగ్రరాజ్యం అమెరికాలో. అక్కడ ఓ పట్టణం అమ్మకానికి వచ్చింది. దాని ఖరీదు విషయంలో కంగారు అక్కర్లేదు. అందుబాటు ధరలో అమ్మేందుకు యజమాని ఆత్రుతతో ఉన్నాడు. 

మిలియన్‌ డాలర్లు జేబులో ఉంటే చాలు.. ఏకంగా ఓ టౌన్‌ మీ సొంతం అయినట్టే. మాంద్యం దెబ్బకు అతలాకుతులం అయిన అమెరికాలో ఇళ్ల ధరలు పడిపోయాయని విన్నాం. కొనేవాళ్లు లేక ఆర్థిక వ్యవస్థే దిగజారిన వైనం అందరికీ గుర్తే. కానీ.. ఇప్పుడక్కడ ఏకంగా ఓ పట్టణాన్నే అమ్మకానికి పెట్టారు. దాని పేరే బ్యూఫోర్డ్‌. జార్జియా రాష్ట్రంలో ఉంది బ్యూఫోర్డ్‌. ఈ చిన్న పట్టణం అమ్మకానికి కారణం.. బస్సు సర్వీసులే. ఒకప్పుడు ఇక్కడ రెండు వేల జనాభా నివశించేవారు. 

కాలం కలిసిరాక.. రవాణా కష్టాలు వెంటాడాయి. బస్సులు నిలపకపోవడంతో ఒక్కొక్కరుగా పట్టణాన్ని ఖాళే చేసేశారు. ఇప్పుడక్కడ ఒకే ఒక్కడు ఉంటున్నాడు. మన దేశంలోని నగరాల్లో మోస్తరు విలాస వంతమైన భవంతిని కొనాలన్నా కోట్లు పెట్టాల్సిందే. అపార్ట్‌మెంట్లో ఫ్లాట్‌ విలువ మినిమం పాతిక లక్షలు పలుకుతోంది. అలాంటిది 50 లక్షలకే ఊరుని అమ్మేస్తున్నారు కదా.. కొన్నవాళ్లకు ఏమేం దక్కుతాయి అనే డౌట్‌ రావచ్చు. 

పదెకరాలకు పైగా భూమి, ఒక గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్, స్కూల్ భవనం, ఓ పెద్ద ఇల్లు, సెల్‌ఫోన్‌ టవర్‌, గ్యారేజ్‌ సొంతమవుతాయి. మంచి బేరాల కోసం ఈ టౌన్‌ యజమాని సమన్స్ ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా మహానుభావులు ఊరును కొనేస్తే తానూ మరో టౌన్‌ వెతుక్కుంటూ వెళ్తానని చెప్తున్నాడు.