స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

స్టాక్‌ మార్కెట్లకు ఒకింత సానుకూల సంకేతాలు వస్తున్నాయి. యూరోప్‌, అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌ సూచీలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. నాస్‌డాక్‌ ఒక శాతం దాకా పెరిగింది. డౌజోన్స్‌ అర శాతం దాకా లాభపడింది. 

ఆసియా మార్కెట్లలో రెండు సూచీలు తప్పించి మిగిలిన సూచీలు లాభాల్లో ఉన్నాయి. తైవాన్‌ ఒక శాతం, జపాన్‌ అర శాతం దాకా నష్టపోతున్నాయి. దక్షిణ కొరియా 1 శాతం, హాంకాంగ్‌ అర శాతం లాభపడుతున్నాయి. సింగపూర్‌ నిఫ్టీ 30 పాయింట్లకు పైగా లాభపడుతూ 5,400 పాయింట్లకు సమీపంలో ట్రేడవుతోంది.