ఓయూలో భారీగా బలగాలు మోహరింపు

ఓయూలో భారీగా బలగాలు మోహరింపు

 ఉస్మానియా యూనివర్శిటీ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఉద్యమాలతో ఎప్పుడూ అట్టుడికిపోయే ఓయూలో ఈసారి ఓ ఫెస్టివల్‌ నిర్వహణ విషయంలో గొడవలు చెలరేగాయి. సీ హాస్టల్‌లో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్‌ విద్యార్థుల మధ్యే కొట్లాటలకు దారి తీసింది. దీన్ని అడ్డుకోవడానికి ఓ వర్గం ప్రయత్నించడం ఘర్షణకు దారి తీసింది. 

వాగ్వాదం, తోపులాట, వాహనాల ధ్వంసం, దహనాలతో కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న క్యాంపస్‌ వేడేక్కింది. ఈ ఘర్షణల్లో ఓ మీడియా వాహనానికీ విద్యార్థులు నిప్పు పెట్టారు. రాత్రి భగ్గుమన్న ఈ ఘర్షణలతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.

బీఫ్‌ ఫెస్టివల్‌కు నిరసనగా ఏబీవీపీ ఇవాళ ఓయూ బంద్‌కు పిలుపునిచ్చింది. మరోవైపు గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్‌ సమీపంలో ఆర్టీసీ బస్సును తగులబెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు.