ప్రభుదేవాను మర్చిపోలేను!

ప్రభుదేవాను మర్చిపోలేను!

సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎవరు ఎప్పుడు దగ్గరవుతారో..ఎవరు దూరమవుతారో చెప్పడం కష్టమే. నయనతారతో గత కొంత కాలంగా ప్రేమాయణాన్ని సాగించిన ప్రభుదేవా తన పుట్టిన రోజు వేడుకని ఈ నెల 3న చెన్నైలో తన శ్రేయోభిలాషుల మధ్య జరుపుకున్నాడు. నయనతార మినహా ఈ కార్యక్షికమంలో చాలా మంది సినీ తారలు పాల్గొన్నారట. అయితే ఈ కార్యక్షికమానికి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో ప్రభుదేవాను దర్శకుడిగా పరిచయం చేస్తూ సిద్దార్థ్ హీరోగా ఎం.ఎస్. రాజు నిర్మించిన చిత్రం 'నువ్వోస్తానంటే నేనొద్దంటానా!'. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. త్రిష మాట్లాడుతూ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా!' నా కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ చిత్రం అది. అలాంటి చిత్రాన్ని తెలుగులో నాకు ప్రభుదేవా అందించాడు. ఆయన అందించిన ఆ విజయాన్ని, ఆయనను జీవితంలో మర్చిపోలేను. ఈ సందర్భంగా ప్రభుదేవాకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని తన సోషల్‌నెట్ వర్కింగ్ సైట్‌లో తెలిపింది త్రిష.