అండర్‌వరల్డ్ 'భాయ్'

అండర్‌వరల్డ్ 'భాయ్'

నవ్యతకు ప్రాధాన్యతనిచ్చే కథానాయకుడు నాగార్జున. ప్రస్తుతం 'శిరిడి సాయి'గా ఆధ్యాత్మిక పాత్రలో నటిస్తోన్న ఆయన త్వరలో మాఫియాడాన్ పాత్రలో కనిపించబోతున్నారు. వీరభవూదమ్ చౌదరి ('పూలరంగడు' ఫేమ్) దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, వీరభవూదమ్ చౌదరి చెప్పిన కథ నాగ్‌ను బాగా ఇంప్రెస్ చేసిందని తెలిసింది. బ్యాంకాక్ నేపథ్యంలో నడిచే ఈ చిత్రంలో నాగార్జున అండర్‌వరల్డ్ మాఫియాడాన్ పాత్రను పోషించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి 'భాయ్' అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు సమాచారం. యమ్.ఎల్.కుమార్ చౌదరి ఈ చిత్రానికి నిర్మాత. 'శిరిడి సాయి' చిత్రీకరణ పూర్తయిన వెంటనే జూన్ నెలలో 'భాయ్' సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.