'భలేతమ్ముడు'గా 'వెట్టాయ్‌'

'భలేతమ్ముడు'గా 'వెట్టాయ్‌'

ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలను వేరొక భాషలోకి అనువదించడమో, పునర్నర్మించడమో జరుగుతున్న విషయం తెలిసిందే. తమిళంలో విజయం సాధించిన 'వెట్టాయ్‌' చిత్రాన్ని యుటీవీ మోషన్‌ పిక్చర్స్‌ తెలుగులో 'భలే తమ్ముడు' పేరుతో అనువదిస్తోంది. ఆర్య, మాధవన్‌, సమీరారెడ్డి, అమలాపాల్‌ వంటి తారలు ప్రధాన పాత్రలు పోషించారు. వీరంతా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మరో విశేషమేమిటంటే...ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎన్‌.లింగుస్వామి కూడా 'ఆవారా', 'పందెంకోడి' వంటి అనువాద చిత్రాల ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంలోని యాక్షన్‌ దృశ్యాలు కూడా కనువిందు చేస్తాయని అంటున్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, త్వరలో ఆడియోను, ఆ తర్వాత సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుండగా, ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్‌కపూర్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలోనే రూపొందిస్తున్నట్లు తెలిసింది.