నిడదవోలులో పాముల గుట్ట

నిడదవోలులో పాముల గుట్ట

ఒక్కపాము కనిపిస్తేనే భయపడిపోతాం. అలాంటిది ఒక్కసారే పదుల సంఖ్యలో పాములు కనిపిస్తే. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో అదే జరిగింది. ఓ ఇంటి పెరట్లో 30 త్రాచు పాములు బయటపడ్డాయి. తొలుత రెండు పాములు కనిపించడంతో చంపే ప్రయత్నం చేశారు ఇంటి యజమానులు. 

వాటి కోసం చెత్త తొలగించే సరికి దాని క్రింద భారీ పాము పుట్ట కనిపించింది. దాన్ని కొల్లగొట్టే సరికి 30 కోడెనాగులు బయటకొచ్చాయి. దీంతో మొత్తం అన్నింటిని చంపేశారు స్థానికులు.