చైనాలో రెండు కొండలపై నిర్మించిన వంతెన

చైనాలో రెండు కొండలపై నిర్మించిన వంతెన

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న వంతెనను చైనాలోని.. రెండు కొండలపై నిర్మించారు. రెండు సొరంగాలను కలిపే అతి పొడవైన వంతెనా ఇదే కావడం గమనార్హం. దీని ఎత్తు సుమారు 1,102 అడుగులు.. పొడవు నాలుగు వేల అడుగులు. దీనిపై 1888 విద్యుద్దీపాలు ఉండటమేకాక నాలుగు లేన్లున్నాయి. 

రెండు వైపులా పాదచారులకు ప్రత్యేకంగా వాక్ వే ఉంది. జిషో - చడాంగ్ ఎక్స్‌ప్రెస్ వేలో భాగంగా నిర్మించిన ఈ వంతెన వల్ల మూడు గంటల రవాణా సమయం ఆదా అవుతోంది. దీని నిర్మాణ పనులు అక్టోబర్ రెండు వేల ఏడు సంవత్సరంలో ప్రారంభం కాగా గతేడాది డిసెంబర్‌లో పూర్తయ్యాయి. అక్కడి ప్రభుత్వం శనివారం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచింది.