జంజీర్ రీమేక్‌కు తొలిగిన అడ్డంకులు

జంజీర్ రీమేక్‌కు తొలిగిన అడ్డంకులు

టాలీవుడ్ హీరో రాంచరణ్ తేజ నటించనున్న జంజీర్ చిత్ర రీమేక్‌కు అడ్డంకులు తొలిగాయి. గతంలో అమితాబ్ నటించిన సూపర్ డూపర్ హిట్‌కు సలీమ్ ఖాన్, జావెద్ అఖ్తర్‌లు కథను అందించారు. జంజీర్ చిత్రాన్ని రాంచరణ్‌తో నిర్మించాలని అమిత్ మెహ్రా నిర్ణయం తీసుకున్నారు. అయితే జంజీర్ చిత్రానికి సంబంధించిన హక్కుల్ని ఎవ్వరికి ఇవ్వలేదని, రీమేక్‌కు అనుమతించబోమని జావెద్, సలీమ్ అభ్యంతరం తెలిపారు. దాంతో ఈ చిత్ర నిర్మాణంపై కొంత వివాదం తలెత్తింది. దాంతో రచయితల్ని సంప్రదించి అమిత్ మిశ్రా అనుమతి తీసుకున్నారు. రచయితలు అనుమతించడంతో జంజీర్ రీమేక్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ విషయాన్ని నిర్మాత అమిత్ మెహ్రా ధృవీకరించారు.