భారత్ రానున్న పాక్ అధ్యక్షుడు

భారత్ రానున్న పాక్ అధ్యక్షుడు

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఈ నెల 8న రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వచ్చే అవకాశం ఉంది. పవిత్ర ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాను ఆయన సందర్శిస్తారని పాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయన పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేశామని పేర్కొన్నాయి. 

జర్దారీ పర్యటన వ్యక్తిగతమైన వ్యవహారమని ఓ పక్క చెపుతూనే.... మరో పక్క ఆయన భారత రాజకీయ నేతలతో చర్చలు జరిపే విషయాన్ని కొట్టిపారేయలేమని తెలిపాయి. అయితే, ఆయన పర్యటనకు సంబంధించిన తేదీని ఇంకా ఖరారు చేయాల్సి ఉందని అదికారులు చెప్పారు. 2005 తరువాత పాకిస్తాన్‌ దేశాధినేత జరిపే తొలి పర్యటన ఇదే అవుతుంది. తర్వాత రష్యాలో 2009లో జరిగిన ఓ సదస్సు సందర్భంగా జర్దారీ భారత ప్రధాని మన్మోహన్‌తో చివరిసారిగా చర్చలు జరిపారు.