ఎన్టీఆర్ 'దమ్ము'పై రాణా కామెంట్...

ఎన్టీఆర్ 'దమ్ము'పై రాణా కామెంట్...

రీసెంట్ గా రిలీజైన  దమ్ము  చిత్రం టాక్ డివైడ్ గా ఉన్నా కలెక్షన్స్ పరంగా స్టడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన మరో నటుడు దగ్గుపాటి రాణా ఓ ఇంటర్వూలో  ఎన్టీఆర్ ని, దమ్ములో అతని నటనని మెచ్చుకున్నాడు. అతని మాటల్లోనే... తారక్ సినిమాలుని జనం తారక్ కోసమే చూస్తారు. అతను పోలీస్ ఆఫీసరో, లాయిరో, పొలిటీషనో గానో కనపడాల్సిన పనిలేదు. నేను ఎప్పుడు అలాంటి స్టేజికి రీచ్ అవుతానో... ప్రజలు మిగతావన్నీ వదిలేసి కేవలం రాణాని మాత్రమే చూసే రోజు ఎప్పుడు వస్తుందో అన్నారు. ప్రస్తుతం రాణా... రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న డిపార్టమెంట్ చిత్రం చేస్తున్నారు. 

ముంబైలోని మాఫియాని ఎలిమినేట్ చేయటానికి ఏర్పాటైన ఏంటి టెర్రరిస్టు స్క్వాడ్ గురించి.. ఆ క్రమంలో పోలీస్ డిపార్టమెంట్ ఎదుర్కొనే స్ట్రగుల్స్ గురించి ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్.. గ్యాంగస్టర్ గా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర పేరు సర్జేరావు గైక్వాడ్. అలాగే దగ్గుపాటి రాణా పోలీస్ అధికారిగా, సంజయ్ దత్ ఓ కీలకమైన రోల్ ని పోషిస్తున్నారు. మంచు లక్ష్మి.. సంజయ్ దత్ కి భార్యగా కనిపించనుంది. డిపార్టమెంట్ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.

వీళ్లు కాకుండా తెలుగులోని  దగ్గుపాటి రాణా , లక్ష్మి మంచు, మధు షాలని కూడా చాలా ముఖ్యపాత్రల్లో ఉన్నారు. మధు షాలిని ఫిమేల్ గ్యాగస్టర్ రోల్ ని పోషిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు నవంబర్ లో ముగించుకుని పిభ్రవరిలో రిలీజ్ చెయ్యటానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఇక మధు శాలిని పాత్ర సినిమాకి హైలెట్ కానుందని చెప్తున్నారు. ఆమె సినిమా అంతా పూర్తిగా సిగెరెట్ కాలుస్తూంటుంది. ఆమె ఇంతకాలం సాఫ్ట్ రోల్ లో కనిపించింది. ఇప్పుడు చాలా వైల్డ్ గా ఉండే పాత్రలో అదరకొట్టనుందని, ఆమె పాత్ర సినిమాకి హైలెట్ అని చెప్తున్నారు.

డిపార్టమెంట్ చిత్రం పోలీస్ వ్యవస్దకి, అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్ మధ్యన ఉండే సంభందాలని ముఖ్య కధా వస్తువుగా తీసుకుని మలచటం జరిగింది. దీంట్లో అమితాబ్ ఒక రాజకీయ నాయకుడుగా మారిన ఎక్స్ క్రిమినల్ పాత్రను పోషిస్తున్నాడు. సంజయ్ దత్ అండర్ వరల్డ్ ని సమూలనంగా నాశనం చెయ్యటానికి సృష్టించిన డిపార్టమెంట్ కి లీడర్ లోల్ వేస్తున్నారు. అభిమన్యు సింగ్ ఒక క్రూరమైన క్రిమినల్ రోల్ ని పోషిస్తున్నాడు. విజయ్ రాజ్ పరారీలో ఉన్న ఒక మాఫియా డాన్ రోల్ పోషిస్తున్నారు.