'గబ్బర్ సింగ్' టైటిల్ ఎంతకు కొన్నామంటే

'గబ్బర్ సింగ్' టైటిల్ ఎంతకు కొన్నామంటే

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్ సింగ్' ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఈ చిత్రం విజయంలో టైటిల్ కి కూడా సక్సెస్ ఉంది. షోలే చిత్రంలో గబ్బర్ సింగ్ క్యారెక్టర్ చాలా పాపులర్. దాంతో షోలే నిర్మాతలు 'గబ్బర్‌ సింగ్‌' నిర్మాత గణేష్ బాబుకి ఈ విషయమై అబ్జక్షన్ చెప్పారు. తమ క్యారెక్టర్ వాడటం కుదరదని చెప్పారు. దాంతో నెగోషియేషన్స్ చేసి గణేష్ బాబు ఈ టైటిల్ ని పాతిక లక్షలకు తీసుకున్నారు. ఈ విషయమై గణేష్ మీడియాతో మాట్లాడారు.

గణేష్ మాట్లాడుతూ...రోహన్ సిప్పీ...ఆయన ప్యామిలీ టైటిల్ విషయమై అబ్జెక్టు చేసారు. కానీ  గబ్బర్ సింగ్  టైటిల్ అప్పటికే పాపులర్ అయ్యింది. దాంతో మేము మార్చలేక పోయాం...పాతిక లక్షలు చెల్లించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం అన్నారు. ఇక ఈ టైటిల్ ని  పవన్ కళ్యాణ్ పెట్టారు. ఈ విషయమై హరీష్ శంకర్ మీడియాకు చెప్పారు. ఎవరికీ తెలియదు కానీ... ఈ సినిమాకి నామకరణం పవన్‌కల్యాణ్‌ చేశారు. 'గబ్బర్‌సింగ్‌' అనే పేరు ఆయన సూచించినదే. తొలిసారి నేను ఆయన్ని కలిసినప్పుడు... సినిమా పేరు చెప్పి పూర్తిస్థాయిలో వినోదం ఉండాలన్నారు అంటున్నారు హరీష్ శంకర్. 

అలాగే... వినోదం విషయంలో ఆయన నన్ను నమ్మినందుకు చాలా సంతోషించాను. నాకు కొంచెం సమయమివ్వండని అడిగాను. ఆర్నెల్లు కష్టపడి ఈ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. 'గబ్బర్‌సింగ్‌' సినిమా ఫలితంతో నేనొక దర్శకుడిగా కంటే... పవన్‌కల్యాణ్‌ అభిమానిగా ఎక్కువ సంతోషిస్తున్నాను.'తొలిప్రేమ', 'ఖుషి' చిత్రాల తర్వాత మళ్లీ అసలు సిసలైన పవన్‌కల్యాణ్‌ సినిమాని చూపించారని అభిమానులు అంటున్నారు. తొలి రోజు, తొలి ఆటే ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశాను. ప్రతి సన్నివేశాన్నీ వాళ్లు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. పరిశ్రమ నుంచి కూడా ఎంతోమంది స్పందించారు. రాజమౌళి, వినాయక్‌, శ్రీను వైట్ల తదితర దర్శకులంతా పవన్‌కల్యాణ్‌ని చాలా శక్తిమంతంగా తెరపై చూపించావని అభినందించడం ఆనందాన్నిచ్చింది అన్నారు 

దబాంగ్ లో మార్పులు చేయటంపై స్పందిస్తూ...హిట్టన సినిమా అయినా తెలుగులు చేసేటప్పుడు మార్పలు అవసరమే. మన ప్రేక్షకుల అభిరుచి, మన హీరోల ఇమేజ్‌కి తగ్గ విధంగా మంచి మార్పులు చేసుకోవాలి. 'దబాంగ్‌'లో హీరో లంచం తీసుకోవడం ఉంటుంది. కానీ నా వరకూ అది నచ్చలేదు. మార్చాను. 'దబాంగ్‌' కథ బాలీవుడ్‌కి కొత్తే. దానికి భిన్నంగా సినిమా తియ్యాలని కొన్ని మార్పులు చేశాను. ఇదొక రీమేక్‌ చిత్రం కాబట్టి... మన నేపథ్యానికి అనుగుణంగా చాలా మార్పులే చేసుకొన్నాం. 'దబాంగ్‌' లోని ప్రతి సన్నివేశాన్నీ విశ్లేషిస్తూ ఈ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం. అందుకే కొంచెం ప్రాసతో మాటలు, మార్పులు అని రాశాను.