సీనియర్ అక్కినేనికి తీరని కోరికలు!

సీనియర్ అక్కినేనికి తీరని కోరికలు!

తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో దాదా పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావుకు ప్రత్యేక స్థానం ఉంది. 89 ఏళ్ల అక్కినేని 75 ఏళ్లకు పైగా ఈ రంగంలో కొనసాగుతున్నారు. ఇన్నేళ్లు సినీ నటుడిగా కొనసాగడం ప్రపంచ రికార్డు. ఇన్నేళ్ల ఆయన సినీ జీవితంలో ఎన్నో పాత్రలు చేశారు. అయితే సీనియర్ అక్కినేనికి తీరని కోరికలు ఇంకా రెండు ఉన్నాయట. ఓ ఇంటర్వ్యూలో ఆయన తన మసులోని మాట బయట పెట్టారు.

తెలుగు కవి యోగి వేమన, రామకృష్ణ పరమ హంసలు అంటే తనకు ఎంతో ఇష్టమని, తాను ఇష్టపడే ఈ ఇద్దరి పాత్రలు చేసే అవకాశం రాలేదని అక్కినేని చెప్పుకొచ్చారు. యోగి వేమన గొప్పకవి. ఆయన జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. అలాగే రామకృష్ణ పరమ హంసగా కూడా నటించాలనుకున్నాను అని తెలిపారు. 

ఈ రెండు పాత్రలకు న్యాయం చేయగలననేది నా నమ్మకం. కానీ నేను నటించే సమయంలో ఎవరూ ఈ ప్రయోగం చేయలేదు. ఇటీవల ఒకరు నన్ను అడిగారు కానీ.... నా వయసు ఆ పాత్రకు సరితూగదని తిరస్కరించినట్లు అక్కినేని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.

దక్షిణాది సినీ పరిశ్రమ ఉత్తరాదికి ధీటుగా ఎదుగుతోందని. అయితే ఉత్తరాదితో పోలిస్తే...దక్షిణాది సినిమా మార్కెట్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని అక్కినేని సూచించారు. సినీ పరిశ్రమలో నేను ఒక భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఎలాంటి కష్టాలు లేకుండా ఈ స్థాయికి ఎదగడం తన అదృష్టమన్నారు