రవి‌తేజ సినిమా నుంచి త్రిష ఔట్

రవి‌తేజ సినిమా నుంచి త్రిష ఔట్

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ‘సార్ వస్తారు' చిత్రం రూపొందనున్న చిత్రం తెలిసిందే. అయితే చిత్రానికి హీరోయిన్ ఇప్పటి వరకు ఇంకా సెట్ కాలేదు. ఇటీవల ఈచిత్రాన్ని హీరోయిన్ అమలా పాల్ వద్దను కోగా....తాజాగా త్రిష కూడా ఈచిత్రం చేయడానికి నిరాకరించింది. డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడం వల్లనే త్రిష ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సార్ వస్తారు షూటింగ్ జూన్ మొదటి భాగంలో ప్రారంభం కానుంది. అయితే అదే సమయంలో త్రిష వేరే సినిమాలకు కమిట్ అయింది. 

ఈ విషయం గురించి త్రిష  తన ట్విట్టర్లో స్పందిస్తూ....‘‘మీరు విన్నది నిజమే, కొన్ని కారణాల వల్ల రవితేజ హీరోగా రూపొందుతున్న ‘సార్ వస్తారు' చిత్రం నుంచి తప్పుకుంటున్నా. త్వరలోనే రవితేజతో కలిసి మరో సినిమాలో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నా. ఈ వేసవిలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాను.... ఎండ్రెడుమ్ పొంగయ్, భూలోగం అనే తమిళ చిత్రాలు చేస్తున్నాను. భూలోగం షూటింగ్ మే ఎండింగులో ప్రారంభం అవుతోంది. ఎండ్రెడుమ్ చిత్రం షూటింగ్ జూన్ మధ్యలో మొదలవుతోంది'' అంటూ పేర్కొంది. 

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బేనర్‌పై ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. యువత, సోలో చిత్రాలు దర్శకత్వం వహించిన పరశురాం ఈచిత్రానికి దర్శకుడు. ‘సార్ వస్తారు' టైటిల్‌పై చాలా క్యాచీగా ఉండటంతో రవితేజ దీనిపై చాలా ఇంట్రస్టు చూపుతున్నాడు.

ప్రస్తుతం రవితేజ నటించిన‘దరువు' చిత్రం ఈ నెల 25న విడుదలకు సిద్దంగా ఉంది. శివ(శౌర్యం ఫేం) దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు.  రవితేజ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించింది.

ఎవరితోనైనా గొడవకు దిగండి. కానీ మాస్‌తో పెట్టుకోకండి. వాళ్ల దగ్గర కాస్త పొగరు ఎక్కువ. ఆనందం వచ్చినా, ఆవేశం వచ్చినా తీన్‌మార్‌ ఆడేస్తారు. ఆ కుర్రాడూ అంతే. నోటితో పోయేదాన్ని, చేతి దాకా తెచ్చుకొంటాడు. గొడవకు దిగడం అంటే మహా సరదా... అనే కాన్సెప్టుతో 'దరువు' సినిమా రూపొందించారు.