‘గబ్బర్ సింగ్' కోసం స్పెషల్ ట్రైన్

‘గబ్బర్ సింగ్' కోసం స్పెషల్ ట్రైన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘గబ్బర్ సింగ్' షూటింగు కోసం స్విట్జర్ లాండ్‌లో ప్రత్యేకంగా ఓ ట్రైన్‌ను బుక్ చేశారు. స్విస్ ప్రకృతి అందాల మధ్య ఇక్కడ ‘దిల్ సే' సాంగును చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణతో గబ్బర్ సింగ్ షూటింగ్ మొత్తం పూర్తయింది. యూనిట్ సభ్యులంతా ఇప్పటికే హైదరాబాద్ బయల్లేరినట్లు సమాచారం. 

ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 4వ తేదీన చిత్రం సెన్సార్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 10వ తేదీన  గబ్బర్ సింగ్  చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

హరీష్ శంకర్  దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ శ్రీపరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్ గా దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇక  శృతి హాసన్  పల్లెటూరి అమ్మాయి భాగ్యలక్ష్మి పాత్రను పోషిస్తోంది. హిందీలో సూపర్ హిట్టయిన దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు.

నిర్మాత  గణేష్ బాబు  ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమా షూటింగు కోసం డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఇటీవల ఆడియో వేడుక సందర్భంగా ప్రత్యేకంగా విమానం బుక్ చేసిన గణేష్...చిత్రీకరణ విషయంలోనూ ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఇవి కాక తాను ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్‍‌కు షూటింగ్ సందర్భంగా సౌకర్యాల కోసం కూడా ప్రత్యేకంగా డబ్బును కేటాయిస్తున్నాడట. సినిమా సూపర్ హిట్టయి డబ్బు తిరిగి వస్తుందనే నమ్మకంతోనే గణేష్ ఈ రేంజ్ లో ఖర్చు పెడుతున్నాడని అంటున్నారు. మరి అతని నమ్మక ఎంత మేరకు ఫలిస్తుందో సినిమా విడుదలైతేగానీ తెలియదు. 

అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: