పవన్ కళ్యాణ్, కోన వెంకట్ మూవీ త్వరలో..!

పవన్ కళ్యాణ్, కోన వెంకట్ మూవీ త్వరలో..!

ప్రముఖ రచయిత కోన వెంకట్ కాంబినేషన్లో సినిమా రాబోతోందా? దీనికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్నారా? అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దూకుడు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు స్కిప్టు అందించిన కోన వెంకట్ తాజాగా పవన్ కళ్యాణ్ కోసం స్ర్కిప్టు రాయడం మొదలు పెట్టారు.

ఫన్ అండ్ యాక్షన్ గా సాగే ఈ స్క్రిప్టును త్వరలోనే పవన్ కళ్యాణ్ కు వినిపించనున్నాడట. ఈ విషయమై కోన వెంకట్ కొన్ని రోజుల క్రితం ట్విట్టర్లో స్పందిస్తూ...‘‘నేను నా యొక్క సోల్ మేట్ పవన్ కళ్యాణ్ కోసం కథ రాయడం మొదలు పెట్టాను. తర్వలోనే ఆయనకు దీన్ని వినిపిస్తా. అయితే దీన్ని  శ్రీను వైట్ల అయితే పర్ ఫెక్టుగా తెరకెక్కిస్తాడని నా నమ్మం. ఈ కథ మొత్తం ఫన్ అండ్ యాక్షన్ తో కూడుకుని ఉంటుంది'' అని చెప్పుకొచ్చారు. గతంలో  కోన వెంకట్  పవన్ కళ్యాణ్ నటించిన ‘బాలు ABCDEFG' చిత్రానికి స్కిప్టు అందించారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్' హిట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్. బండ్ల గణేస్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మించారు. తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాస్తూ ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్‌గా దూసుకెలుతోంది.

పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ సరసన తమన్నా ఎంపికైంది. ఇందులో పవర్ స్టార్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించనున్నారు.