'గబ్బర్ సింగ్' పై సిద్దార్ధ ట్వీట్

'గబ్బర్ సింగ్'  పై సిద్దార్ధ ట్వీట్

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ని చూసిన సినిమావాళ్లంతా తమదైన శైలిలో ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. తాజాగ సిద్దార్ధ.. గబ్బర్ సింగ్ చిత్రం చూసి.. ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ లో... ప్రతీ షోకు  గబ్బర్ సింగ్  లెజండ్ అవుతోంది. స్టార్ పవర్ ఆఫ్ ది పవర్ స్టార్.. కలెక్షన్స్ చూస్తే మతిపోతోంది అన్నట్లు ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. నిన్న నాగార్జున రెండో కుమారుడు  అక్కినేని అఖిల్  కూడా ఈ చిత్రం లాంటి ఎంటర్టైన్మెంట్ చిత్రం ఈ మధ్యకాలంలో చూడలేదంటూ ట్విట్ చేసాడు. 

ప్రస్తుతం సిద్దార్ద.. నందినీ రెడ్డి దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రం చేస్తున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న సిద్దార్ధకి సినిమాలు మాత్రం గ్యాప్ రాకుండా విడుదల అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా సిద్దార్ద నటించిన ఐదు చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిల్లో మొదట తన సొంత ప్రొడక్షన్ లో నిర్మించిన లవ్ ఫెయిల్యూర్ చిత్రం విడుదల అయ్యి యావరేజ్ అయ్యింది. ఆ తర్వాత దీపా మెహతా దర్శకత్వంలో రూపొందుతున్న మిడ్ నైట్ చిల్ట్రన్ చిత్రం వస్తుంది. ఇక ఈ రెండు చిత్రాల అనంతరం హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విడుదల అవనుంది. 

ఇవన్నీ వేరే భాషల్లో రెడీ అవుతున్న చిత్రాలు. తెలుగు విషయానికి వస్తే పిల్ల జమీందార్ దర్శకుడు అశోక్ దర్శకత్వంలో రూపొందనున్న సుకుమారుడు చిత్రం అనుకున్నారు కానీ అది వర్కవుట్ కాలేదు. నందీనీ రెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించే చిత్రాలు విడుదల అవుతాయి. ఇవన్నీ కాక మరో మూడు చిత్రాలు ఈ సంవత్సరం ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఇక సిద్దార్ద ఈ మధ్య కాలంలో బావ, 180, ఓ హ్ మై ప్రెండ్ చిత్రాలతో నిరాశపరిచాడు. అయినా అతనిపై నిర్మాత, దర్శకులుకు నమ్మకాలు మాత్రం తగ్గలేదు. అతనికి పోటీగా ఎదుగుతాడు అనుకున్న వరుణ్ సందేశ్ సైతం డల్ అవ్వటంతో మళ్లీ సిద్దార్ధ హవా ప్రారంభమయ్యింది. 

మరో ప్రక్క  సిద్దార్ధ  విక్కీ డోనర్ అనే హిందీ చిత్రం తమిళ, తెలుగు రైట్స్ తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం లో హీరోగా సిద్దార్ద చేస్తాడనే వార్తలు వినిపించాయి. అయితే సిద్దార్ద మేనేజర్ రామ్ మాత్రం వీటిని ఖండిస్తున్నారు..సిద్దార్ద డెఫినెట్ గా విక్కీ డోనర్ రీమేక్ లో చేయడు అన్నారు. విక్కీ డోనర్ చిత్రాన్ని శశి అనే వ్యక్తి తరుపున సిద్దార్ద కొనుగోలు చేసారు. వై నాట్ స్టూడియోస్ కి చెందిన శశితో సిద్దార్దకి స్నేహం ఉంది. అందుకే శశి తరపున సిద్దార్ద నిర్మాత జాన్ అబ్రహంతో మాట్లాడి ఆ చిత్రం రైట్స్ తీసుకున్నారు.