ఏపీ రాజకీయాల్లోకి నటి కళ్యాణి

ఏపీ రాజకీయాల్లోకి నటి కళ్యాణి

అవును వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు, దొంగోడు, పెదబాబు, కబడ్డీ కబడ్డీ తదితర చిత్రాల ద్వారా తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి కళ్యాణి ఆంధ్రప్రదేశ్ రాకీయాల్లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంది. రేపు ఈ విషయమై అధికారిక ప్రకనట చేయనున్నట్లు తెలుస్తోంది. తకు తెలుగు ప్రజలంటే మహా అభిమానమని, పుట్టింది కేరళలో అయినా తకు ఇక్కడి వారితో మంచి అనుబంధం ఏర్పడిందని, అందుకే ఇక్కడే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చూస్తోందట. అయితే ఆమె ఏ పార్టీలో చేరనుందనే విషయం ఇంకా బయటకు చెప్పలేదు.

హీరోయిన్ గా పెద్దగా నిలదొక్కుకోక పోవడంతో దర్శకుడు సూర్య కిరణ్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకి కాస్త దూరమైన కళ్యాణి , అడపాదడపా మాత్రమే తెరపై కనిపిస్తోంది. తాజాగా ఆమె 'అజ్ఞాతం' అనే చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తోంది. శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం కమలాలయ బ్యానర్‌పై ఎస్.వి.ఎన్ రావు నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...మహిళలకు సంబంధించిన సబ్జెక్టుతో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నామని, మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో ముఖ్యంగా ఫోకస్ చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం గురించి దర్శకడు శ్రీధర్ మాట్లాడుతూ...కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి సందేశాన్ని అందించే విధంగా ఈ సినిమాని రూపొందించినట్టు చెప్పాడు.

అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని అన్నాడు. ఈచిత్రంలో ఇంకా సుబ్బరాజు, దీప్తీ ప్రియ, తనికెళ్ల భరణి, బెనర్జీ, కృష్ణ భగవాన్, ప్రభాకర్ తదితరులు నటిస్తున్నారు.