స్నేహ మెడలో మూడు ముళ్లు

స్నేహ మెడలో మూడు ముళ్లు

హీరోయిన్ స్నేహ, ప్రసన్నల వివాహం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు చెన్నయ్‌లోని శ్రీవారు వెంకటా చలపతి ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. స్నేహ తరపున నాయుడు సంప్రదాయంలోనూ, ప్రసన్న కుటుంబం తరపున బ్రాహ్మణ సంప్రదాయంలోనూ వీరి వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళ సినీ పరిశ్రమలోని ప్రముఖులతో పాటు పలువురు తెలుగు సినీ సెలబ్రిటీలు కూడా హాజకయ్యారు. 

ఎరుపు రంగం చీరలో బంగారం, వజ్రాలతో కూడిన ఆభరణాలు స్నేహ అందానికి మరింత వన్నె తెచ్చాయి. ప్రసన్న తమిళ సాంప్రదాయం ప్రకారం అంగవస్త్రాన్ని ధరించారు. పెళ్లి అనంతరం జరిగే శోభనం వేడుక కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. పెళ్లి అనంతరం నెల రోజుల పాటు ఈ జంట సినిమాల షూటింగులు సెలవు పెట్టి హానీ మూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. 

'అచ్చముండు అచ్చముండు' చిత్రం ద్వారా నటుడు ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి ద్వారా ఓ ఇంటివారయ్యారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో ఈ వివాహం జరిగింది. ఇరకపై నటించే విషయమై స్నేహదే తుది నిర్ణయమని ప్రసన్న పేర్కొనగా, తానింకా దానిపై ఆలోచించలేదని  స్నేహ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఆరునెలలు పోరాడి పెళ్లికి పెద్దలను ఒప్పించామని ప్రసన్న చెప్పారు. తాను రెండు సార్లు(నాయుడు, బ్రాహ్మణ సంప్రదాయాల్లో ఒక్కోసారి) తాళి కడుతున్నానని ప్రసన్న తన ఆనందాన్ని మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. పెద్దల మనసును కష్టపెట్టకూడదనే ఉద్దేశ్యంతోనే రెండు సార్లు వివాహం చేసుకుంటున్నామని వారు గతంలో చెప్పారు.