'యముండ'స్టోరీ లైన్ ఏంటి?

'యముండ'స్టోరీ లైన్ ఏంటి?

అల్లరి నరేష్ హీరోగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల చంటి 'యముండ'అనే టైటిల్ తో ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ గా రూపొందుతున్న ఈ చిత్రం యముడు బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. కథ ప్రకారం అల్లరి నరేష్ ఓ అల్లరి నరేష్. ఆ అల్లరి కుర్రాడికి అన్నింట్లోనూ తొందరే. ఏం చేసినా చిరిగి చాటంత అయితేనేగానీ మనసు కుదుటపడదు. అయితే ఒకానొక సిట్యువేషన్ లో ఈ అల్లరి కుర్రాడు యమలోకం వెళ్తాడు. యమధర్మరాజు ఎలాంటి శిక్ష వేస్తాడో అని అందరూ భయం భయంగా వరుసలో నిలుచున్నారు. కానీ ఓ  అల్లరి నరేష్  మాత్రం... యముడి కూతురిపై కన్నేశాడు. ఓ శుభముహూర్తాన అతను ప్రేమలోపడ్డాడు. తండ్రి చాటుగా ఉన్న యమపుత్రికను తదేకంగా చూస్తూ ప్రేమ మైకంలోకి దించేశాడు. భూలోకంలోని కుర్రాడికీ, యముడి గారాలపట్టికీ ప్రేమ బంధం ఎలా పడిందో తెర మీదే చూడాలి.


‘అల్లరి'నరేష్ మాట్లాడుతూ...యమ లోకం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకొన్నాయి... మా చిత్రానికీ నేపథ్యం ఆ లోకమే. అయితే యముడితో ఓ యువకుడు ఆడిన ఆట ఏమిటనేది మా చిత్రంలో చూడాలి. అలాగే సత్తిబాబు దర్శకత్వంలో అంతకుముందు ‘బెట్టింగ్ బంగార్రాజు' చేశాను. ఆ తర్వాత చాలా కథలు చెప్పాడు. చివరకు ఈ సోషియో ఫాంటసీ కథ నన్ను బాగా ఆకట్టుకుంది. యమలోకం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నా ఫేవరెట్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ‘అల్లుడా మజాకా'లోని ‘అత్తో అత్తమ్మ కూతురో' పాటను ఇందులో రీమిక్స్ చేస్తున్నాం. గంటన్నర సేపు గ్రాఫిక్స్‌ ఉంటాయి. రమ్యకృష్ణతో కలిసి నటించడం ఆనందంగా ఉంది అన్నారు.

రిచా పనయ్‌ ఈ చిత్రం ద్వారా పరిచయమవుతోంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో ముఖ్య సన్నివేశాల్ని, పాటల్నీ చిత్రీకరించారు. నిర్మాత చంటి అడ్డాల మాట్లాడుతూ ''యమలోకం నేపథ్యంగా సాగే సరదా చిత్రమిది. నరేష్‌ శైలిలోనే సాగుతుంది. యముడి దర్బారు, బృందావనం లాంటి సెట్స్‌ని కనువిందు చేసేలా తీర్చిదిద్దాము''అన్నారు. 
దర్శకుడు మాట్లాడుతూ ''దేవుడి దృష్టిలో అందరూ సమానమే. అయితే... మనుషుల మధ్య ఇన్ని అంతరాలు ఎందుకున్నాయనే ఇతివృత్తంతో సాగే కథ ఇది. దీన్ని వినోదాత్మకంగా చెబుతున్నాం. యముడిగా సాయాజీ షిండే నటిస్తున్నారు. నరేష్‌ నవ్వించడమే కాదు యముడి చేత కన్నీళ్లు పెట్టిస్తాడు. యముడి భార్యగా రమ్యకృష్ణ నటిస్తున్నారు''అని చెప్పారు.


నిర్మాత మాట్లాడుతూ -‘‘అయిదేళ్ల విరామం తర్వాత ఈ సినిమా చేస్తున్నాం. 9 నెలలు శ్రమించి ఈ కథ తయారు చేశాం. దాదాపు 12 సెట్లు వేస్తున్నాం. రిచా పనయ్‌ను నాయికగా పరిచయం చేస్తున్నాం. రామోజీ ఫిల్మ్‌సిటీలో పన్నెండు సెట్లు వేస్తున్నాం. రెండు పాటల రికార్డింగ్‌ కూడా పూర్తయింది. మే 15 వరకూ తొలి షెడ్యూల్‌ జరుగుతుంది''అన్నారు 
నరేష్‌, గిరిబాబు, కృష్ణభగవాన్‌, రఘుబాబు, ధర్మవరపు, భరత్‌, సుధ తదితరులు ఇతర పాత్రధారులు. మూల కథ: జయ సిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, కళ: కిరణ్‌కుమార్‌.యమ్‌, కూర్పు: గౌతంరాజు, కెమెరా: కె.రవీంద్రబాబు, సంగీతం: కోటి